ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు28:ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థి జి.డి సునీల్ కుమార్‌కు ఏయూ డాక్టరేట్ లభించింది. పొందూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్ మధుసూధన రావు పర్యవేక్షణలో ఇండో-లెవాంటైన్ ట్రేడ్ డ్యూరింగ్ ఎర్లీ ఐరన్ ఏజ్- ఎన్ ఆర్కలాజికల్ స్టడీ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ నుంచి డాక్టరేట్ ఉత్తర్వులను ఈ రోజు సునీల్ కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆచార్య జలాది రవి, చరిత్ర విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు తదితరులు అభినందించారు.
0 Comments