ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆగష్టు 28:'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) 2026 లో భాగంగా నిర్వహిస్తున్న ఇంటర్నల్ హ్యాకథాన్’ పోస్టర్‌ను ఏయూ వీసీ ప్రొఫెసర్ జి.పి. రాజ శేఖర్ విడుదల చేశారు.
పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజ శేఖర్ మాట్లాడుతూ, వర్తమాన సమాజం మరియు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులు నవ్య ఆలోచనలతో పనిచేయాలని, సాంకేతికతను ఉపయుక్తంగా నిలుపుకుంటూ పరిష్కాలను చూపాలని సూచించారు.
పోస్టర్ ఆవిష్కరణలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డీన్‌లు ఆచార్య జి.ఎం.జె రాజు, కె.రమ సుధ, ఆచార్య కె.రాజేంద్ర ప్రసాద్, ఐటి విభాగాధిపతి ఆచార్య డి.లలిత భాస్కరి, ఆచార్య ఎస్.హరనాథ్, ఆచార్య కె.వి రమణ, ఆచార్య పద్మ తదితరులు పాల్గొన్నారు.
"టూవర్డ్స్ బిల్డింగ్ ఎ స్మార్ట్ నేషన్" (స్మార్ట్ దేశ నిర్మాణ దిశగా) అనే జాతీయ లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల పోటీలు సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఇంజనీరింగ్ కళాశాల న్యూ క్లాస్‌రూమ్ కాంప్లెక్స్‌లోని IT&CA విభాగంలో నిర్వహిస్తారు. వాస్తవ ప్రపంచ సమస్యలకు విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక పరిష్కారాలను అణ్వేషించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ప్రతి బృందంలో టీమ్ లీడర్‌తో కలిపి గరిష్టంగా 6 గురు సభ్యులు ఉండవచ్చు. కనీసం ఒక మహిళా సభ్యురాలు ఉండటం తప్పనిసరి. జట్టు సభ్యులందరూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులై ఉండాలి. వివిధ విభాగాల విద్యార్థులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందాలరే ప్రత్యేకంగా బోనస్ పాయింట్లు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 3వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

0 Comments