SRINIVAS SPL Correspondant
అల్లవరం, విశాఖ సందేసం.....అల్లవరం మండలంలో ఇటీవల ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసినదే .. ఆ గల్లంతైన మత్స్యకారులను మానవతా దృక్పథంతో కాపాడిన పశ్చిమబెంగాల్ వాసులు బెoడమూర్లంక సెంటర్ కి రావడంతో ఆ పశ్చిమ బెంగాల్ వాసులు ముగ్గురిని బిజెపి అల్లవరం మండలం తరపున ఘనంగా సన్మానించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ముగ్గురి యువకుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్ బీజేపీ మండల అధ్యక్షులుగా ఉండడం గమనార్హం... దేశ సేవలో అయినా మానవతా సేవలో అయినా ముందుండి నడిపించే వారిలో బిజెపి ముఖ్యపాత్ర ఉంటుందని ఈ సందర్భంగా నారాయణ మూర్తి గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో SIR (సర్) కన్వీనర్ సంసాని రత్నకుమార్, (SIR) కో కన్వీనర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు వాసంశెట్టి దుర్గ వరప్రసాద్, బజరంగ్దళ్ నాయకులు పట్టా నాగరాజు, చిట్టూరి సత్యమధు, గంటా సత్తిబాబు, కోపనాతి శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.


0 Comments