విద్యానిధి విద్యాసంస్థల్లో వ్యావహారిక తెలుగు భాషా స్ఫూర్తిని పునశ్చరణ...

 

                SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం....వ్యావహారిక తెలుగు భాషా పితామహులు శ్రీ గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలను విద్యానిధి విద్యాసంస్థల విద్యార్థులు అత్యంత  ఘనంగా నిర్వహించారు‌. తొలుత రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యాన్ని వాడుక భాషలోకి తీసుకురావటానికి, ప్రజలకు సులభంగా అర్ధం అయ్యేరీతికి ఆయన చేసిన కృషిని గురించి భాషోపాధ్యాయులు ఉపాధ్రాష్ట  కృష్ణ  కుమారి  విద్యార్ధులకు వివరంగా చెప్పారు. 

గిడుగు రామమూర్తి వేషధారణలో 7వ తరగతి విద్యార్ధి ఏ .యశ్వంత్  చెప్పిన వ్యావహారిక సంభాషణలు ఈరోజు ప్రాముఖ్యతను చాటి చెప్పాయి. హైస్కూల్ విద్యార్ధినులు ప్రదర్శించిన తాళ్ళపాక తిమ్మక్క, తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల వేషధారణలు, సంభాషణలు ఉత్సాహంగా , స్ఫూర్తిదాయకంగా సాగాయి.

 చదువుతున్న మాధ్యమం ఆంగ్ల మైనా, మాతృభాష పట్ల మమకారం, ఆసక్తిని పెంపొందించుకుని, తెలుగు భాషాలో ఉన్న ఉత్తమమైన గ్రంధాలను ప్రతీ విద్యార్థి చదవాలనీ, తద్వారా మరింత భాషాభిరుచి, విజ్ఞానం పెరుగుతాయని విద్యాసంస్థలు చైర్మన్  ఎ. బి. నాయుడు అన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన కవులు, కవయిత్రుల సాంప్రదాయ వేషధారణలు ఆకట్టుకున్నాయి‌. ఈ కార్యక్రమంలో ప్రాథనోపాధ్యాయులు  టి .ఎన్  మాధవి  , ఉపాధ్యాయులు  కె  నాగ మణి  , ఏ .జ్యోతి , ఎస్. గంగ భవాని  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments