అమ్మ మాధుర్యం పంచే బాష తెలుగు మరువలేము..... శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృ బాష తెలుగు బాష దినోత్సవ కార్యక్రమం

 

            SRINIVAS SPL Correspondant 
అమలాపురం,:విశాఖ సందేసం.:ప్రపంచ బాషల కన్నా మన తెలుగు బాషను మనస్సుల్లో ఎప్పటికి అమ్మ మాధుర్యం పంచే బాష తెలుగు. మాతృ బాష తెలుగు బాష దినోత్సవ కార్యక్రమం 


అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు కళాశాల వైస్ చైర్మన్ కరాటం ప్రవీణ్ ఆధ్వర్యంలో తెలుగు మాస్టర్ శంసున్ ఘనంగా నిర్వహించారు.


 ముఖ్యతిదులుగా కళాశాల సెక్రటరీ మరియు కర్స్పాడెంట్ కె వి. ఎన్ ఆర్ నరసింహారావు, మాజీ తెలుగు ఉపాధ్యాయులు, సోషల్ ఆక్టివిట్స్ డా. రాయుడు శ్రీ రామచంద్ర మూర్తి, వరప్రసాద్, జాన్ పాల్ పాల్గొని కీర్తి శేషులు తెలుగు బాష అభివృద్ధి ప్రధాత గిడుగు రామ్మూర్తి జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ముఖ్యతిదులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం తెలుగు బాష ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసి, అమ్మబాషను మరువకూడదని తెలియజేసారు.


విద్యార్థులు పలు తెలుగు కవితలు ద్వారా తెలుగు బాష గురించి తెలిపారు.అనంతరం తెలుగు ఉపాధ్యాయులు శాంసూను,  డా. రాయుడు శ్రీ రామచంద్ర మూర్తి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వరప్రసాద్, జూన్, కళాశాల ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, వెంకట శ్రీనివాస్, దివ్య, భవాని, వైష్ణవి , విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments