అట్టహాసంగా శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం... అయినవిల్లి ఆది గణపతి క్షేత్రాన్ని ఆదర్శ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడమే ద్యేయం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ... ఎమ్మెల్యే గిడ్డి సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్ విళ్ల సూర్యనారాయణ, పాలకవర్గ సభ్యులు

.             SRINIVAS SPL Correspondant 
అమలాపురం, విశాఖ సందేసం...అయినవిల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామంలోని వినాయక సదన్‌లో పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ సమక్షంలో  శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి క్షేత్రం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటని అన్నారు. స్వయంభువుగా వెలసిన ఆది గణపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందన్నారు. 

దేశం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దానికి నూతన చైర్మన్ సూర్యనారాయణ, పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని సూచించారు. నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన  విళ్ల సూర్యనారాయణ (సూరయ్య కాపు), నూతన పాలకవర్గ సభ్యులందరికీ ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పాలకవర్గం సమష్టిగా పనిచేసి భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయ అభివృద్ధితో పాటు క్షేత్ర పవిత్రతను కాపాడాలని సూచించారు. అయినవిల్లి క్షేత్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన పార్కింగ్ సమస్యను శాసనసభలో ప్రస్తావించి, దాని పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.

అయినవిల్లి క్షేత్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూముల కొనుగోలు, అదనపు వసతి, పార్కింగ్, రహదారులు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను కల్పించే విధంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాణ్ , దేవాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి  ఎమ్మెల్యే  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ సహకారం, పాలకవర్గ సమన్వయం, అధికారుల కృషితో అయినవిల్లి ఆది గణపతి క్షేత్రాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే గిడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాల సుబ్బారావు, చిట్ఠురి శ్రీనివాస్,

డి.వీ.వి.సత్యనారాయణ, అల్లాడ సొంబాబు, శిరంగు వెంకటేశ్వరరావు, నల్లా పవన్ కుమార్, గుత్తుల సాయి, కూడుపూడి బుజ్జి, సత్యనారాయణ రాజు, కాకర శ్రీనివాస్కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, రాష్ట్ర డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు, నీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments