Dr. Nanduri Ramakrisha Sr Sub Editor
విశాఖపట్నం, ఆగస్టు 24: జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారిగా బదిలీ అయ్యి శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా (డీఎంహెచ్‌ఓ) పదోన్నతను పొంది జీవీఎంసీ లో ఉత్తమ సేవలందించిన డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్ కుమార్‌ను సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
ఈ సందర్భంగా ముందుగా సోమవారం పెందుర్తిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఫోన్ ద్వారా డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్ కుమార్‌ను అభినందించి ప్రశంసించారు. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారిగా ఆయన అందించిన సేవలను కమిషనర్ కొనియాడుతూ, పదోన్నతితో కొత్త బాధ్యతలు చేపడుతున్న ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టి ప్రజాసేవకు అంకితం కావాలని తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారిగా డాక్టర్ నరేష్ కుమార్ అందించిన సేవలను అభినందించారు. స్వచ్ఛ సర్వేక్షన్, స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో ప్రత్యేక ప్రతిభను కనబరిచారని,ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలన, దోమల నియంత్రణ, డెంగ్యూ మలేరియా తదితర వ్యాధుల నిర్మూలనకు ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. పదోన్నతితో శ్రీకాకుళం డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయన మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.
డాక్టర్ నరేష్ కుమార్ కు జీవీఎంసీ సిటీ వెటర్నరీ ఆఫీసర్ కిరణ్ కుమార్ ,బయాలజిస్ట్ సాంబమూర్తి ,సహాయ వైద్యాధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments