విశాఖలో ముగిసిన విద్యాభారతి అఖిలభారత సెకండరీ స్థాయి కార్యశాల


విశాఖపట్నం: విద్యాభారతి - అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సెకండరీ స్థాయి విద్యాపరిషత్ అఖిలభారత కార్యశాల విజయవంతంగా ముగిసింది. ఆగస్టు 23, 24, 25 తేదీలలో నగరంలోని విశాలాక్షీనగర్ B.V.K కళాశాలలో ఈ కార్యశాల జరిగింది.

ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా 55 మంది ప్రాంత, క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు.

విద్యాభారతి అఖిలభారత సంఘటనా కార్యదర్శి శ్రీ గోవింద్ చంద్ర మహంత, ప్రధాన కార్యదర్శి శ్రీ దేశ్ రాజ్ శర్మ, సహ సంఘటనా కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఆరావ్ కార్ పాల్గొని సెకండరీ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా NEP అమలు, కౌశల్ వికాస్ తరగతుల ప్రారంభం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, విద్యారంగ సవాళ్లు-పరిష్కారాలు, విద్యార్థులలో కమ్యూనికేటివ్ స్కిల్స్ అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ కార్యశాల సెకండరీ స్థాయి అఖిలభారత ప్రముఖ్ శ్రీ రాజీవ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర ఉపాధ్యక్షులు ఆచార్య శ్రీ గొల్లపల్లి నాగేశ్వరరావు, ముగింపు కార్యక్రమంలో ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీ కన్నా భాస్కర్, ప్రాంత కార్యకారిణి సభ్యురాలు శ్రీమతి బి. ధరణిప్రియ పాల్గొన్నారు.

                              Trinadh 

                         Bvk College PRO

Post a Comment

0 Comments