SRINIVAS SPL Correspondant
అమలాపురం, విశాఖ సందేసం....డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొబ్బరి వలుపు కార్మికుల సంఘం అధ్యక్షులు కడలి సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొబ్బరి వలుపు కార్మికులు తమ శ్రమకి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలంటూ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ కార్యాలయం నందు పీజీ ఆర్ ఎస్లో విన్నవించుకుని జిల్లా రెవిన్యూ అధికారి వి. సుబ్బారావుకు పిర్యాదు చేశారు. శ్రీ వినాయక వలుపు కార్మిక సంఘం అధ్యక్షులు నేదునూరి లవరాజు మాట్లాడుతూ మండలంలోని 11 సంఘాలలో సుమారు 4 వేల మంది వలుపు కార్మికులు ఉన్నామని ప్రతి రెండు సంవత్సరాలకు ఆగస్టు నెల 14 తేదిన కొబ్బరి వ్యాపారస్తులు సంఘం సమావేశం నిర్వహణ జరిగేదని ఈ సంవత్సరం ఆగష్టు 16 న సమావేశం జరగగా తమ శ్రమకి తగ్గ రేటును ఇవ్వకపోగా రెండు మూడు దాపాలుగా పెంచుతామణి చెప్పిన కొబ్బరి వ్యాపారస్తుల నిర్ణయం సరికాదని వలుపు కార్మికులు 15 తేది నుండి పనులను నిలిపివేశామని, 12 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు చర్చలకు రాలేదని జిల్లా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
శ్రీ ఉమామహేశ్వర వలుపు కార్మిక సంఘం చింతల్లంక అధ్యక్షులు దాకారపు సత్య ప్రకాష్ మాట్లాడుతూ కొబ్బరి వ్యాపారస్తులు వలుపు కార్మికులు సమస్య తక్షణమే పరిష్కరించకపోతే తమ కుటుంబ సభ్యులతో కలసి ఆకలి పోరాటనికి సిద్దమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుత్తుల భీమేశ్వరరావు, తరిట్ల సత్యనారాయణ మట్టపర్తి సుబ్రహ్మణ్యం, మల్లవరపు నాగరాజు, యాడ్ల రమేష్ బాబు, కుంచే సత్యనారాయణ, కూసుమే సురేష్ పాల్గొన్నారు.


0 Comments