తిరుపతి జిల్లా పెద్దకన్నలి గ్రామంలో నిర్వహించనున్న గంగమ్మ జాతర, కుంభాభిషేక మహోత్సవాలకు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిని గ్రామస్తులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర, కుంభాభిషేక మహోత్సవాల వివరాలను తెలియజేస్తూ ఆహ్వాన పత్రికను ఎంపీ గురుమూర్తికి అందజేశారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎంపీ గురుమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

0 Comments