విశాఖపట్నం:విశాఖ సందేశం వర్తవాహని:ఈరోజు అనగా తేదీ 02.09.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రమును సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బందిని పబ్లిక్ పెర్సప్షన్, కె.పి.ఐ. ఇండికేటర్స్ గురించి సమీక్షించారు. తదుపరి ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా హాస్పిటల్ సేవలు అందుతున్నవి లేనివి తెలుసుకొనుట, ఇ.హెచ్.ఆర్., అభ ఐడి రిజిస్ట్రేషన్, ఆర్.బి.ఎస్.కె సేవలు, ఓపి, ఐపి సేవలు, ల్యాబ్ టెస్ట్ లు, మందులు లభ్యత, ఎఫ్.ఆర్.ఎస్. హాజరు మొదలగు విషయాల గురించి సమీక్ష నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్ర పరిసర ప్రాంతములు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ సందర్శనలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి.నాగభూషణం వారు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం


0 Comments