శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలంలో సెప్టెంబర్ 11న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం మహిళా భక్తులు ముందస్తుగా వివరాలు నమోదు చేసుకోవాలి వాట్సాప్ ద్వారా వివరాలు పంపేందుకు 85000 98375


సింహాచలం:విశాఖ సందేశం వర్తవాహని :సెప్టెంబర్ 2, 2026:శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11వ తేదీన శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.

ఈ ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనదలచిన మహిళా భక్తులు తమ వివరాలను ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. 

ఇందుకోసం పేరు, గోత్రం, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాచ్ నంబర్ మరియు సమయం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.

సామూహిక వరలక్ష్మీ వ్రతానికి అవసరమైన పూజా ద్రవ్యాలు, ప్రసాదాలను దేవస్థానం తరఫున ఏర్పాటు చేస్తారు.

ఆచమనం కోసం ఉద్దరిణి, పంచపాత్రలను భక్తులు స్వయంగా తీసుకురావాలి.

ఆసక్తి ఉన్న భక్తులు పూజ కోసం పుష్పాలను తమ వెంట తీసుకురావచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు అంతరాలయ దర్శనం లభించదు.

ఆధార్ కార్డు ధృవీకరణ అనంతరం మాత్రమే మండపంలోకి అనుమతిస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం అధికారులు కోరారు.

వివరాల నమోదు / సంప్రదింపుల కోసం

📱 వాట్సాప్ నంబర్: 85000 98375

📧 ఈ-మెయిల్: eodow.eosvlnsd@gov.in


కార్యనిర్వహణాధికారి

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం

Post a Comment

0 Comments