ఆధునిక పరిశోధనా పద్ధతులపై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిపి రాజశేఖర్


విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని: ఆంధ్ర యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక శాస్త్రాలలో ఆధునిక పరిశోధనా పద్ధతులపై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం: సమకాలీన సాధనాలు, సాంకేతికతలు మరియు అనువర్తనాలు ప్రోగ్రాం యొక్క పోస్టర్ ను ఈ  రోజు 02.09.2026 బుధవారం నాడు ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ ఆవిష్కరించి సామాజిక శాస్త్రాలలో ఆధునిక పరిశోధనా పద్ధతులపై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం ఏర్పాటు చేయడం సామాజిక శాస్త్రాల డిపార్ట్మెంట్లలో  పనిచేస్తున్న అధ్యాపకులకు, పోస్ట్ డాక్టర్లు ఫెలోస్ మరియు పరిశోధకులకు ఎంతో ఉపయోగకరమని ప్రస్తుతం ప్రపంచంలో నూతన పరిశోధనలు ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని వికసిత్ భారత్ సాధనకు తోడ్పాటునిస్తాయని తెలియజేస్తూ అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం కన్వీనర్ మరియు ప్రిన్సిపల్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రొఫెసర్ జాలాది రవి కి శుభాకాంక్షలు తెలియజేశారు, కన్వీనర్ ప్రొఫెసర్ జాలాది రవి మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ,  రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపకులు, పోస్ట్ డాక్టర్ ఫెలోస్ మరియు పరిశోధకులు ఈ అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, పరిశోధన మరియు అభివృద్ధి డీన్ మరియు హెడ్ , డిపార్ట్మెంట్  డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ వల్లి కుమారి, డైరెక్టర్, రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రొఫెసర్ కే.వెంకట్రావు మరియు అసిస్టెంట్ ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ప్రొఫెసర్ వి. శ్రీమన్నారాయణ మరియు అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం కో కన్వీనర్ డాక్టర్ బోరుగడ్డ సుబ్బయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments