క్యాంప‌స్ అంబాసిడ‌ర్‌గా శ్యామ్ కుమార్‌


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని :సెప్టెంబ‌ర్2 ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం జాగ్ర‌ఫీ విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి పోలిరెడ్డి శ్యామ్ కుమార్ మై గౌ క్యాంప‌స్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు. భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌- ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ  ఈ గుర్తింపు అందించింది. యువ‌జ‌న సంబంధిత కార్య‌క్ర‌మాల‌లో చురుకైన భూమిక పోషిస్తూ విక‌సిత్ భార‌త్ యంగ్ లీడ‌ర్స్ డైలాగ్ 2026(ఢిల్లీ) వంటి కార్య‌క్ర‌మాల‌లో శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. మై భార‌త్ బ‌డ్జెట్ క్వెస్ట్ యూత్ డైలాగ్‌, బ్రిక్స్‌, మై భార‌త్‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం, ప్ర‌చారం చేయ‌డంలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. 

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన క్యాంప‌స్ అంబాసిడ‌ర్‌గా ఎంపికైన శ్యామ్ కుమార్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ త‌న కార్యాల‌యంలో అభినందించారు. మైటీ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే విభిన్న యువ‌త‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌పై యువ‌త‌లో అవ‌గాహ‌న క‌ల్పించే విధంగా ప‌నిచేయాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ఆచార్య ఎస్‌.హ‌ర‌నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments