విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సంస్కృతి విభాగం అధ్యక్షులు మారుతి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మద్దిలపాలెం కృష్ణా కాలేజ్ రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పార్టీ నాయకులు వేంపాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్క్ హోటల్ సమీపంలోని వై.యస్. ఆర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు, పార్లమెంట్ సభ్యులు గొల్ల బాబూరావు తదితరులు పాల్గొని వై.యస్. ఆర్ విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.*వై.యస్. రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయం: కెకె రాజు*ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కెకె రాజు మాట్లాడుతూ.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల పెన్నిధిగా, రైతు బాంధవుడిగా, విద్యా ప్రదాతగా, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. వై.యస్. ఆర్ అకాల మరణించి 17 సంవత్సరాలు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన స్థానం చెక్కుచెదరలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా తనను నమ్ముకుని తన వెంట నడిచిన నాయకులు, కార్యకర్తల పట్ల ఆయన చూపిన ప్రేమ, ఆప్యాయత మరువలేనివని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాకుండా భారత రాజకీయాల్లోనూ వై.యస్. ఆర్ పాలన సువర్ణ అధ్యాయంగా నిలిచిందని కెకె రాజు అన్నారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కోసం కాకుండా దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో వై.యస్. ఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. విద్యారంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కార్యక్రమాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. దీంతో ఎంతోమంది తల్లిదండ్రుల కలలను సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్న ప్రచారానికి భిన్నంగా రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిచ్చిన నాయకుడు వై.యస్. ఆర్ అని కెకె రాజు అన్నారు. రైతుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా, వెలుగులు తీసుకురావడానికి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మహిళా సాధికారతకు కూడా వై.యస్. ఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగేందుకు అనేక అవకాశాలు కల్పించారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో వై.యస్. ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని కెకె రాజు అన్నారు. ఆర్థిక స్థోమత లేక వైద్యం పొందలేక ఏ కుటుంబంలోనూ విషాదం చోటుచేసుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య రంగానికి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికతో జలయజ్ఞానికి వై.యస్. ఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. పోలవరం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో వై.యస్. ఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాము చేస్తున్నామని చెప్పుకుంటున్న అనేక ప్రాజెక్టులకు వై.యస్. ఆర్ హయాంలోనే పునాదులు పడ్డాయని కెకె రాజు విమర్శించారు. వై.యస్. ఆర్ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. వై.యస్. ఆర్ ఆశయాల సాధన కోసం వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కెకె రాజు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ , తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , మొల్లి అప్పారావు, శాసన మండలి సభ్యులు కుంభ రవి బాబు, వరుదు కళ్యాణ్ , మాజీ పసుపులేటి బాల రాజు , మాజీ పార్లమెంట్ సభ్యులు గోడ్డేటి మాధవి, మాజీ శాసన సభ్యులు తిప్పల నాగి రెడ్డి , తైనాల విజయ కుమార్ , కోటగళ్ళు భాగ్య లక్ష్మి , పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి , పార్టీ నాయుకులు కోలా గురువులు , జహీర్ అహ్మద్, పెడాడ రమణి కుమారి, గొల్లగాని హరి వెంకట్ కుమారి, కట్టుమూరు సతీష్, శోభా స్వాతిరాణి, ఫరూక్, సతీష్ వర్మ, రంగలి జగన్నాథం, పివి నారాయణ, వెంకటరమణి రెడ్డి , ఉమ్మడి స్వాతి దాస్ , నాగమల్లేశ్వరి, పేర్ల విజయ్ చందర్, రవిరాజు, జీలకర్ర నాగేంద్ర, ద్రోణంరాజు శ్రీ వాస్తవ, పివి సురేష్ , అంబటి శైలేష్, అల్లు శంకర్ రావు , అనిల్ కుమార్ రాజు , బిపిఎన్ కుమార్ జైన్, సనపల రవీంద్ర భరత్, పిలా ప్రేమ్ కుమార్, మెరువ గణేష్, దేవరకొండ మార్కండేయులు, శ్రీ దేవి వర్మ , నీలి రవి , అల్లంపల్లి రాజాబాబు, ఆల్ఫా కృష్ణ, వానపల్లి ఈశ్వరరావు, తుళ్ళి చంద్రశేఖర్, కె వి బాబా, షబేరా బేగం, బయ్యవరపు రాధా, భాను, రాయుడు , ఈశ్వరి పలివేల, పంచ విశాలాక్షి , శ్రీనివాస్ రెడ్డి , రామ కృష్ణ రెడ్డి , ఈశ్వరరావు, బుర్ర కుమార్ రెడ్డి, బుజ్జి వెంకటరెడ్డి, సత్యనారాయణ, సంధ్య, పత్తిపాడు కనకరాజు, వెంకట్రావు, మువ్వల సంతోష్, మధుసూదన్ రెడ్డి, సాగర్, హరికృష్ణ, అప్పన్న, సత్య, మధుసూదన్, బొడ్డేటి మాధవి, కోటఘలు భాగ్యలక్ష్మి , బలగాని లక్ష్మి, ఉమ్మడి దాస్, లావణ్య, సత్యవేణి, లక్ష్మణ్, బమగారు భవాని శంకర్ , రవి కుమార్ , కాశి తదితరులు పాల్గొన్నారు


0 Comments