విశాఖపట్నం: విశాఖ సందేశం వర్తవాహని:ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విద్య, పరిశోధన రంగాల్లో విశేష సేవలందించిన ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు ప్రతిష్ఠాత్మక నేషనల్ ఐఈటీఈ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా భావించే ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు.
విద్య, పరిశోధన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషి, సేవలను గుర్తించి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ అవార్డును ఈ నెల 25న కోల్‌కతాలో నిర్వహించనున్న మెగా కార్యక్రమంలో ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజుకు ప్రదానం చేయనున్నారు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల విద్యావేత్తలు, పరిశోధకులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు

0 Comments