పోలవరం ఎడమ కాలువ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు *
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అపర భగీరధుడుగా శాశ్వతంగా నిలిచిపోతారని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు.
ఈ రోజు అనగా *02.09.2026* తేదీన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద బుధవారం జరిగిన పోలవరం ఎడమ కాలువ నీటి విడుదల, జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అనిత రామానాయుడు, పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, చింతకాయల విజయ్, ఎమ్మెల్యేలతో కలసి పాల్గొన్న పంచకర్ల రమేష్ బాబు గంగమ్మ తల్లికి పూజలు చేసి పూలు అక్షింతలు వేశారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల కల, నాలుగు దశాబ్దాలు తర్వాత ఈ నాటికి నెరవేరిందని, ఈ ప్రాంత ప్రజలు ప్రధాన నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని వెల్లడించారు.ఈ జలాలు కేవలం వ్యవసాయం కోసం మాత్రమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి ప్రజల తాగునీటి అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఈ ప్రాంత రూపు రేఖలు మార్చే బృహత్తర కార్యక్రమం ఇది అని కొనియాడారు. కొందరు నాయకులు మాదిరిగా ప్రచార ఆర్భాటం కాకుండా నిత్యం పని ... పని అంటూ తప్పని పడే ఏకైక నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృతంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఇందులో తాను కూడా భాగస్వామి కావడం అదృష్టం అని పేర్కొన్నారు



0 Comments