సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు, జంతు వధశాలలకు సెలవు. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.


విశాఖపట్నం, సెప్టెంబర్ 2: శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 4, 2026 (శుక్రవారం) మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చికెన్, చేపలు, రొయ్యలు తదితర విక్రయ దుకాణాలతో పాటు జంతు వధశాలలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు నగర పరిధిలోని సంబంధిత మాంసం, చికెన్, చేపలు, రొయ్యల విక్రయ దుకాణాలు, జంతు వధశాలలను సెప్టెంబర్ 4న తప్పనిసరిగా మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెరిచి మాంసం, చికెన్, చేపలు, రొయ్యలు తదితరాలను విక్రయించినా, జంతు వధశాలలను నిర్వహించినా సంబంధిత వారిపై నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ


Post a Comment

0 Comments