విశాఖపట్నం, సెప్టెంబర్ 2: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగర ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారం అందేలా , పరిసరాలు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కొరకు ఏర్పాటు చేసిన SHE Teams (Sanitation, health & environment) బృందాలు గాజువాక జోన్ పరిధిలోని 66, 72 వార్డుల్లో బుధవారం హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు జీవీఎంసీ గాజువాక జోన్ సహాయక వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.గాజువాక లో వంటిల్లు జంక్షన్ నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బందితో SHE Team బృందంగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో వంటగదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన ఆహారం, ట్విన్ బిన్ల ఏర్పాటు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, ట్రేడ్ లైసెన్సుల తదితర అంశాలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొన్ని హోటళ్లలో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పాడైన, వినియోగానికి అనర్హమైన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వంటగదుల్లో పారిశుధ్య ప్రమాణాలు పాటించని, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించిన, ట్రేడ్ లైసెన్సులు పొందని లేదా రెన్యువల్ చేసుకోని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకొని మొత్తం రూ.45 వేల అపరాధ రుసుమును వసూలు చేసినట్లు తెలిపారు.ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలు వెంటనే లైసెన్స్ పొందాలని, గడువు ముగిసిన లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతి వాణిజ్య సంస్థలో తడి, పొడి వ్యర్థాల కోసం ప్రత్యేక డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసి, నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు.ప్రజల ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రత్యేకంగా నగరంలో SHE Teams ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించేదా, కార్యచరణ చేపట్టారని, నగరవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో నిత్యం తనిఖీలు షీ టీమ్స్ నిర్వహిస్తున్నాయని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఆహార భద్రత, పారిశుధ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడం సంబంధిత నిర్వాహకుల బాధ్యత అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో గాజువాక జోన్ ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, SHE Team సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments