విశాఖపట్నం-రోజు అనగా తేది 11.09.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అధ్యక్షతన ART, సరోగసి బృందం తో కలిసి డా. జ్యోత్స్న ఫెర్ట్లిటీ విమెన్ వెల్నెస్ క్లినిక్ (ART లెవెల్-1) మురళీ నగర్, విశాఖపట్నం, సరోగసి కేంద్రము రెన్యువల్ కొరకు దరఖాస్తు చేసుకున్న లండన్ ఐవిఎఫ్ సెంటర్, ఒయాసిస్ ఐవిఎఫ్ సెంటర్, లైఫ్ ఫెర్ట్లిటీ సెంటర్ల ను తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా.పి.జగదీశ్వర రావు వారు సదరు కేంద్రముల వారికి పలు సూచనలు చేసారు. ఆపరేషన్ థియేటర్, వార్డ్, స్కానింగ్ మెషిన్ తనిఖీ చేసారు. ఈ పై ఆసుపత్రులు ART కేంద్రముల నిర్వహణకు అనుమతులు కలవో లేవో అని డాక్టర్స్, స్టాఫ్ యొక్క విద్యార్హతలు, ల్యాబ్ పరికరములు పరిశీలించి తగు సలహాలు ఇచ్చారు. ఈ కేంద్రములలో పేదవారికి కూడా ఫీజు తగ్గించి తీసుకోవాలని కోరారు.
ఈ తనిఖీ బృందం లో డా.విద్యారమ, గైనకాలజిస్ట్, VGH, డా.సుష్మ, రేడియోలజిస్ట్,డా. కిషోర్, పెథాలాజిస్ట్ KGH, శ్రీమతి శోభశ్రీ, సోషియాలాజిస్ట్, శ్రీమతి, ఎల్. వి రమణి ఎన్.జి.ఒ, శ్రీ కె.శివాజీ, మానిటరింగ్ కన్సల్టెంట్, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, మొదలగు సభ్యులు పాల్గొన్నారు.
డా.పి.జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం


0 Comments