ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా 17 నుండి నెల రోజులు పాటు సేవా కార్యక్రమాలు - బాజపా నేత కేఎన్ఆర్*

 

విశాఖ బిజేపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశం జరిగిన. ముఖ్య వక్తగా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ సేవా సంకల్ప్ అభియాన్ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా ఇంచార్జ్ శ్రీమతి రెడ్డి పావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు విశాఖపట్నం జిల్లాలో ఆశీర్వాద దీపం, 25 కోట్ల భారతీయ చిన్నారుల కలలు,సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, సేవలో నా భాగస్వామ్యం,రంగోళి దేశం,వంటి 11 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సేవా సంకల్ప్ అభియాన్ సభ్యులు కేఎన్ఆర్ తెలిపారు. అందులో భాగంగా 

సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా ఇంచార్జ్ లతో పాటు,ప్రతి మండలానికి ముగ్గురిని ఇంచార్జ్ లుగా నియమించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దానేష్,మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి వర్రి లలిత, జిల్లా కోకన్వీనర్ సునీత , యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మూర్తి, కార్యదర్శి గోవింద్ మరియు మండల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments