విశాఖపట్నం- విశాఖ సందేశం వార్తా వాహిని -హైదరాబాద్లో వేలాది మందితో విజయవంతమైన ఈ వేడుక, ఇప్పుడు విశాఖ సముద్రపు చల్లని గాలుల నడుమ నగరవాసులను ఉర్రూతలూగిస్తోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆర్కే బీచ్ రోడ్డు రన్నర్లు, క్రీడాకారులు, యువత, విద్యార్థులతో కిటకిటలాడింది. దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ వినీత్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు కూడా మారథాన్‌లో పాల్గొన్నారు.
ముఖ్య అతిథులు జెండా ఊపి పరుగును ప్రారంభించగా, ఉత్సాహభరిత నినాదాలతో సాగర తీరం మార్మోగింది.
వేలాది మంది రన్నర్లు, నగర ప్రముఖులు, వాకర్స్ ఉత్సాహంగా పరుగులు తీశారు. విజేతల కోసం రూ. లక్ష వరకు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందించారు.
రన్నర్ల కోసం వైద్య శిబిరాలు, వాటర్ పాయింట్లు అందుబాటులో ఉంచారు. విశాఖను ఫిట్నెస్ క్యాపిటల్గా మార్చే దిశగా ఈ ఈవెంట్ విశేష స్పందనను సొంతం చేసుకుంది.
విశాఖ కె.వి.శర్మ సంపదకులు

0 Comments