జీవీఎంసీలో 98 నుంచి 120 వార్డుల పునర్విభజనపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల. * 120 వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలు సెప్టెంబర్ 5 నుంచి ప్రజల పరిశీలనకు అందుబాటులో. * జీవీఎంసీ వెబ్‌సైట్‌తో పాటు ప్రధాన, 10 జోనల్ కార్యాలయాలు, ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల్లో వివరాలు అందుబాటులో. * సూచనలు, అభ్యంతరాలను సెప్టెంబర్ 11లోపు కమిషనర్‌కు సమర్పించాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: ప్రభుత్వ ఆదేశాల మేరకు మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ (Delimitation of Wards) శుక్రవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్ (వార్డుల పునర్విభజన) నియమాలు–1996కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.570, తేదీ 06-11-1996లోని రూల్–8, తదనంతర సవరణలు, అలాగే G.O.Ms.No.60, MA&UD(G) శాఖ, తేదీ 12-01-2020, C&DMA, ఆంధ్రప్రదేశ్ వారి Proceedings Roc.No.13032/2/2026/H1-1, తేదీ 01-04-2026, Circular Roc.No.13032/2/2026/H1-1, తేదీ 04-09-2026 ప్రకారం జీవీఎంసీ పరిధిని 120 వార్డులుగా పునర్విభజిస్తూ, ఆయా వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

ప్రతిపాదిత 120 వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సెప్టెంబర్ 5 నుంచి ప్రజల పరిశీలనార్థం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, పునర్వ్యవస్థీకరించిన 10 జోనల్ కార్యాలయాలు, జీవీఎంసీ పరిధిలోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులతో పాటు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్ www.gvmc.gov.in⁠� లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషనర్ తెలిపారు.

కావున జీవీఎంసీ పరిధిలోని నివాసితులు ప్రతిపాదిత వార్డుల పునర్విభజన, సరిహద్దులకు సంబంధించి ఏవైనా సూచనలు లేదా అభ్యంతరాలు ఉన్నట్లయితే, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 11, 2026లోపు కమిషనర్, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ వారికి సమర్పించాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ

Post a Comment

0 Comments