విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని -కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘ఇంటింటికి తెలుగుదేశం - 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం’’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. నాయకులు, కార్యకర్తల పట్టుదలతో కేవలం 40 రోజుల్లోనే కోటి ఇళ్లను సందర్శించి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనను, ప్రజలకు అందిన సంక్షేమ వివరాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతోపాటు సూపర్ సిక్స్ హామీ అమలు తీరును ప్రజలకు వివరించారు. పార్టీ కేడర్ ప్రజలతో మమేకం కావాలనే సంకల్పానికి ఈ కోటి ఇళ్ల సందర్శన మైలు రాయి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి రోజూ లక్షలాది కుటుంబాలను నేరుగా కలుస్తూ, ప్రజలతో మమేకం అవుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, రెండేళ్ల కూటమి పాలన విజయాలను వివరించడంతోపాటు ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ వారి సమస్యల పరిష్కార దిశగా పార్టీ శ్రేణులు కృషి చేశారు. ఈ మైలురాయి చేరుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలదే క్రెడిట్. కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కార్యకర్తలకు అభినందనలు. ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనం. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.
*పల్లా శ్రీనివాసరావు,*
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు*

0 Comments