108 రకాల మిఠాయిలతో నైవేద్యం...


విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని- వివేకానంద సంస్థ వారు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి 2 వ రోజు వేడుకలలో శ్రీకృష్ణ భగవాన్ కి 108 రకాల స్వీట్లతో నైవేద్యం ఏర్పాటు చేశారు. వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు 

డాక్టర్ జహీర్ అహ్మద్ గారు, ద్రోణం రాజు. శ్రీ వాత్సవ్,Y.S.R.C.P. సీనియర్ నాయకులు కొండ .రాజీవ్ గాంధీ, ప్రేమ సమాజం అధ్యక్షులు మట్టపల్లి. హనుమంతరావు, 35వ వార్డు Ex. కార్పొరేటర్ విల్లూరి. భాస్కరరావు, 32 వ వార్డు Ex.కార్పొరేటర్ , శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కందుల. నాగరాజు,T.D.P. నాయకులు గో డి.  నరసింహ చారి, మొదలైన ప్రముఖులు శ్రీకృష్ణ భగవాన్ పూజా కార్యక్రమంలో పాల్గొని, శ్రీకృష్ణ వేషధారణ పిల్లలకు బహుమతులను అందించారు.108 రకాల స్వీట్లతో పూజా కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పలు రకాల సేవా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్న సంస్థ వారిని కొనియాడారు. ఈ పూజా కార్యక్రమంలో శర్మగారు, అర్జున్ గారు , కోటేశ్వరరావు, భానోజీ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments