ఆర్యవైశ్య యువజన సంఘం లో కృష్ణాష్టమి వేడుకలు


విశాఖపట్నం వన్టౌన్ ప్రాంతంలోగల ఆర్యవైశ్య యువజన సంఘం లో  కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం నాడు 12 సంవత్సరాల లోపు బాలబాలికలచే కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

శ్రావణమాసం సందర్భంగా మహిళలచే నిర్వహించబడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కృష్ణాష్టమి వేడుకలు  నిర్వహించారు.   కార్యక్రమంలో చిన్నారులచే ఉట్టి కొట్టించటం, చిన్నికృష్ణుడు, రాధ, గోపికలు వేష ధారణ పోటీలు, చిన్నారి కృష్ణుల చిలిపి పనులు వంటి కార్యక్రమాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు.  సుమారు 30 మంది చిన్నారులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా ఆనందంగా సాగింది.

ఈ సందర్భంగా  కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ పర్సన్  శ్రీమతి కొత్తా  ఉమాకుమారి,  కో చైర్ పర్సన్ శ్రీమతి కొత్తా లక్ష్మి   మాట్లాడుతూ చిన్నారుల్లో దేవునిపట్ల భక్తి భావం, కృష్ణతత్వం, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశ్వాసం ఫరిడవిల్లేలా వారికి అర్థమయ్యే రీతిలో శ్రీకృష్ణుని ఆటపాటలు, గీతాలతో వివరించినట్లు తెలిపారు.


కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్వవహరించిన శ్రీమతి కొత్తా లక్ష్మి చిన్నారులను ఉత్సాహభరితంగా ఉంచేందుకు, చిన్నారులకు కృష్ణుని పట్ల అవగాహన కలిగించేందుకు చిన్ని కృష్ణునికి సంబంధించిన విషయాలను వారికి వివరిస్తూ ఉత్తేజ పరిచారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల్లో కృష్ణ తత్వం, భక్తి భావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం అని అన్నారు. 

కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.  


ఈ కార్యక్రమంలో  ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రియుతులు కొల్లూరు సూర్యారావు, యలమర్తి గణేష్  కోశాధికారి  కొత్తా అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు కె.వి.వి.సుబ్రమణ్యం, సహాయకోశాధికారి పూసర్ల సంజీవరావు సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ దుర్గా సోమేశ్వర రావు, కే.ఎమ్.వి.ఎస్.టి. రామకృష్ణ మరియు గ్రంధి పద్మ, కొత్తా సాహిత్య , కొప్ఫాక లక్ష్మి, చిన్ని రాధాకృష్ణుల తల్లిదండ్రులు,  ఆర్యవైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post a Comment

0 Comments