విశాఖపట్నం -వన్ టౌన్ కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల సందర్బంగా నాల్గవ శుక్రవారం నాడు అమ్మవారు హరిద్ర వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయం పునర్నిర్మాణంలో వున్నందున అమ్మవారి బాలాలయంలో ఉదయం 6 గంటలకు శుధ్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలతో సహ 108 ద్రవ్యములతో క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి హరిద్రవస్త్రాలంకరణ గావించి, హరిద్రకణిక (పసుపుకొమ్ము) లతో అలంకరణ గావించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించినట్లు దేవాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితాసహశ్రనామ పారాయణం చేసిన పిదప దేవస్థాన ఆస్థాన పురోహితులు శ్రీ ఆర్. బి. బి. కుమారశర్మ గారి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రతిష్టించిన శ్రీమహాలక్ష్మి దేవికి మహిళలచే సామూహికంగా లక్ష్మిసహశ్రనామ కుంకుమార్చన నిర్వహించినట్లు శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యురాళ్ళు కడిమిశెట్టి దంతేశ్వరి, కొత్తా లక్ష్మి మరియు కొత్తా ఉమామహేశ్వరి, తెలిపారు.
క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు, సామూహిక పూజలు చేసిన మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు దేవస్థాన సంఘ కోశాధికారి శ్రీ దోమ వెంకట బాలాజీ కుమార్ తెలిపారు.
కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ ప్రసాద వితరణ జేశారు.
****




0 Comments