. SRINIVAS SPL Correspondent
అమలాపురం, విశాఖ సందేసం...శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని అమలాపురం జనుపల్లి గ్రామంలో ఉన్నా ఇస్కాన్ మందిరంలో శ్రీ కృష్ణష్టమి వేడుకలు గురూజీ శివానంద స్వామిజీ ఆధ్వర్యంలో కన్నులపండుగగా జరిగాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ సోంబాబు, రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, సీనియర్ పాత్రికేయులు ఎమ్.ఎన్. వి ప్రసాద్ (బాబి), వైసీపీ మండపేట పరిశీలకులు వంటెద్దు వెంకన్నాయుడు, జనసేన రూరల్ మండల అధ్యక్షులు లింగోలు పండు, మాజీ ఎంపీపీ వాకాపల్లి వెంకన్నాయుడు, టీడీపీ నాయకులు వాసంశెట్టి జగదీష్ పాల్గొని శ్రీ కృష్ణ రాధాల వేశాధారణలో ఉన్నా చిన్నారులచే కృష్ణుడికి ఇష్టమైన ఉట్టి కొట్టె కార్యక్రమం చేయించారు. పలు పాఠశాలలో నిర్వహించిన డ్రెస్ కంపిటేషన్, డ్రాయింగ్ పోటీలలో విజేతలకు భక్తులు మాట్లాడితూ జనుపల్లి ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణుడు జన్మదిన వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరిగియని, ఈ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి కార్యక్రమాలలో వర్షిణి పాడిన పాటలకు భక్తులు ఆకట్టుకుంది.శివానంద స్వామీజీ మాట్లాడుతూ వేడుకలలో ఎమ్మెల్యే ఆనందరావు, ముఖ్యనాయకులు పాల్గొన్ని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడం చాలా ఆనందమన్నారు. ఇస్కాన్ ఫౌండర్ భక్తి వేదాంత స్వామీజీ ఆచార్య గుర్తుగా పలు ప్రవచనాలు, భారీ అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు




0 Comments