శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్

 ​


సింహాచలం 3 సెప్టెంబర్ 2026.సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని సౌత్ కోస్ట్ రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (AGM) శ్రీ సత్యప్రకాష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు ఆలయ పర్యవేక్షణ అధికారి కరోతి సూర్యనారాయణ, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి రామజోగారావు వీరికి  స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖులకు మొదట కప్పస్తంభం ఆలింగనం చేయించి,  శ్రీ స్వామివారి  దర్శనం కల్పించారు.

​దర్శనానంతరం ఆలయ వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం అందజేయగా, అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలను బహూకరించారు.

Post a Comment

0 Comments