లోకానికి వెలుగులు నింపిన శ్రీకృష్ణ పరమాత్ముడు* *ఇస్కాన్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు* *కృష్ణ భగవానుని దర్శించుకున్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు* *లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష*


సాగర్ నగర్ విశాఖపట్నం, సెప్టెంబర్ 4:లోకానికి వెలుగులు నింపడంతో పాటు ప్రతి జీవి సంతోషంగా, ధర్మబద్ధంగా జీవించే మార్గాన్ని చూపిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, డాక్‌యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు *గంట్ల శ్రీనుబాబు* ఆకాంక్షించారు.

శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా విశాఖపట్నంలోని సాగర్ నగర్ ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో గంట్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని శ్రీకృష్ణ భగవానుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు వీరు పొందారు.

ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం మానవాళికి ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ, ప్రేమ, సేవా భావాలకు మార్గదర్శకమన్నారు. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన సందేశం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, దేశం శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థించినట్లు తెలిపారు.

ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కృష్ణ భగవానుని దర్శించుకున్నారు

Post a Comment

0 Comments