. SRINIVAS SPL Correspondent
అల్లవరం, విశాఖ సందేసం డా. బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అల్లవరం మండలం గోడితిప్ప ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా(స్కూల్ అసిస్టెంట్) విధులు నిర్వహిస్తున్న శెట్టిబత్తుల సత్యనారాయణ(ఎస్. ఎస్.ఎన్) ఎంపిక అయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు అందాయి.. శనివారం గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకోనున్నారు. గోడితిప్ప యూపీ, ముమ్మిడివరం, అల్లవరం, కొమరగిరిపట్నం, ఓడలరేవు జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా సత్యనారాయణ పనిచేశారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అయిన సత్యనారాయణను ఉపాధ్యాయ సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆయన వద్ద విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు అభినందించారు.

0 Comments