కోనసీమ రైల్వేప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలి: కోనసీమ జేఎసి

.             SRINIVAS SPL Correspondent 
 అమలాపురం, విశాఖ సందేసం....ఈ నెల  9వ తారీఖున రాష్ట్ర  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబాజీపేట పర్యటనకు  వస్తున్న నేపథ్యంలో   కోనసీమ జేఎసి కార్యవర్గం సభ్యులు  కన్వీనర్ బండారు రామమోహన్ రావు ఆధ్వర్యంలో  స్థానికంగా చిన్నవంతేన వద్ద రైల్వేలైన్ శంకుస్థాపన ప్రాంతంలో సమావేశం అయ్యారు. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఇదే ప్రాంతంలో శంకుస్థాపన జరిగి ఇప్పటికీ రెండున్నర దశాబ్దాలు అవుతుందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణపు పనులు నత్తనడకన జరుగుతుండడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు సందర్బాల్లో కోనసీమ రైల్వేప్రాజెక్ట్ త్వరలో పూర్తివుతుందని హామీ ఇచ్చినప్పటికీ నిర్మాణపు పనుల్లో ఎటువంటి ప్రగతి లేదని వక్తలు పేర్కొన్నారు.

 భూసేకరణ పనులు పూర్తిగా ఆగిపోయాయని వాపోయారు.కాబట్టి ఈ రైల్వేప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తివుతుందో స్పష్టమైన ప్రకటనను సీఎం చంద్రబాబు  అంబాజీపేటలో చేయాలని జేఎసి కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో డా.రాయుడు శ్రీరామచంద్ర మూర్తి, భాగవతుల మూర్తి, కరాటం ప్రవీణ్, పమ్మ నాగేశ్వరావు, ఎస్. శాంసన్, మడికి శ్రీరాములు,రంకిరెడ్డి శ్రీనివాసరావు, కల్వకొలను బాబు, కార్టూనిస్ట్ రాము, డా.చిత్రపు మాణిక్యుమార్, డా.మధుర నరసింహమూర్తి, నంద్యాల నాయుడు, టి.సుందరరామయ్య, యార్లగడ్డ రవీందర్, మాచిరాజు నాగేశ్వరావు, ఏ.భాను మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments