ఆంధ్రవిశ్వవిద్యాలయం,సెప్టెంబర్5:ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మిషన్ మౌసంలో భాగంగా ఏర్పాటు చేసిన కోస్టల్ అట్మాస్ఫియరిక్ టెస్ట్‌బెడ్(సి-ఏఆర్‌టి) పై అధికారులు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో పాటు ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ ఏ.సూర్యచంద్రరావులు హాజరయ్యారు. సి-ఏఆర్‌టిలో భాగంగా గత ఏడాది కాలంలో ఏయూలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరికరాలు, వాటి నుంచి సేకరించిన సమాచారం, విశ్లేషించి ఉపయుక్తంగా నిలుపుతున్న అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ ఏ.సూర్యచంద్రరావు స్వాగతం పలికారు. అనంతరం ఏయూలో సి-ఏఆర్‌టి కేంద్రం ఏర్పాటు, ప్రాధాన్యత తదితర అంశాలను డాక్టర్ పద్మ వివరించారు. అనంతరం సి-ఏఆర్‌టి కేంద్రం ఏర్పాటు, ప్రగతి, భవిష్యత్ అభివృద్ధికార్యక్రమాలు, మౌళిక వసతులు, అవుట్‌రీచ్ కార్యక్రమాల వివరాలను డాక్టర్ సచిన్ తెలియజేశారు. అనంతరం ఐఐటిఎం శాస్త్రవేత్తల బృందం డాక్టర్ సుభ్రత, డాక్టర్ లీన, డాక్టర్ రమేష్, డాక్టర్ జెనిలు సి-ఏఆర్‌టి కేంద్రం ఏర్పాటు చేసి సేకరింస్తున్న సమాచారం విశ్లేషించడం, పరికరాలను ఉపయుక్తంగా నిలపడం, భవిష్యత్ అవసరాలు, అవకాశాలను వివరించారు.
ఏయూలో సి-ఏఆర్‌టి కేంద్రం ఏర్పాటు కావడం వలన జరిగే అభివృద్ధి, ఏయూకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే మేలు తదితర అంశాలను ఆచార్య పి.సునీత తెలిపారు. సి-ఏఆర్‌టి కేంద్ర పనితీరు,ప్రగతి, అభివృద్ధిపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తరువాత వాతావరణ సంబంధంగా లభిస్తున్న సమాచారం, డేటాను విశ్లేషించడం, ఉపయుక్తంగా నిలపడంపై పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో డిప్లమా, సర్టిఫీకేట్ కోర్సుల నిర్వహణ జరిపే దిశగా దృష్టి సారించాలని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సూచించారు. కేంద్రం పనితీరు, ప్రగతి పట్ల ఏయూ, ఐఐటిఎం శాస్త్రవేత్తలు, నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేంద్రం భవిష్యత్తులో మరింత సమాజ ఉపయుక్తం పరిశోధనలు జరపాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆచార్య పి.సునీత, ఆచార్య సి.వి నాయుడు, ఆచార్య ఎస్.ఎన్ రవి,డాక్టర్ ఏ.ప్రవీణ్ కుమార్,డాక్టర్ స్వాతి బసు, ఆచార్య వి.కె దద్వాల్, ఐఐటిఎం శాస్త్రవేత్తలు, ఏయూ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments