యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోపర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

 


విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని-యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కోసం విశాఖలో వివిధ ప్రాంతాలలో

 ఉచిత మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసారు.యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ కమల్ బైడ్ సూచనలమేరకు గౌరవ అధ్యక్షుడు నండూరి రామకృష్ణ,అధ్యక్షుడు వీఎస్ జగన్మోహన్, కార్యదర్శి కేవీ శర్మ,కోశాధికారి కొణతాల శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి ఎన్ అరుణ్ భాస్కర్(హరి),సభ్యుడు ఎం హరనాధ్ తదితరులు శని, ఆదివారాలలో దొండపర్తి ,పెదవాల్తేరు, శ్రీనగర్ తదితర ప్రాంతాలలో  మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసారు. 

 ప్రమోటర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో దొండపర్తి ఎరుకమాంబ ఆలయం దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ గోలగాని వీరరావు (బుజ్జి) ముఖ్యఅతిధిగా హాజరై మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసారు.ఈ సందర్భంగా వీరరావు (బుజ్జి) మాట్లాడుతూ   ప్లాస్టర్ ఆఫ్ పారిస్  రసాయన రంగులతో చేసిన విగ్రహాల వల్ల జరిగే జల కాలుష్యాన్ని అరికట్టేందుకు, భక్తులలో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు

 ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యూత్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.స్వాతి ప్రమోటర్స్ డీజీఎం టీ రమేష్ మాట్లాడుతూ   సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా చెరువులు, నదులు కలుషితం కాకుండా కాపాడవచ్చునని తమ సంస్థద్వారా ఎబ్హైవేల మట్టివిగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.కొణతాల శ్రీనివాస్ మాట్లాడుతూ  పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలనే పిలుపుతో, సాధారణ ప్రజలకు, భక్తులకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఈ ప్రతిమలను అందజేస్తున్నామని తెలిపారు

.నండూరి రామకృష్ణ మాట్లాడుతూ  రాబోయే తరాలకు ప్రకృతిని కాపాడాలనే సత్సంకల్పంతో, పండుగ సంప్రదాయాలను పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించుకోవాలనే సందేశం అందించడమే లక్ష్యంగా ఉచిత మట్టివినాయక ప్రతిమలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments