. SRINIVAS SPL Correspondent
ఉప్పలగుప్తం, విశాఖ సందేసం....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ కార్యదర్శిగా ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం గ్రామానికి చెందిన నల్లా వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు తన నియమాకానికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంటు కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, నియోజకవర్గం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య, ఐ టి విభాగం జిల్లా అధ్యక్షులు తోరం గౌతమ్ రాజా లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుని వైస్సార్సీపీ పార్టీ విజయానికి కృషి చేస్తానని వరప్రసాద్ అన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ శ్రేణులు వరప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు

0 Comments