అల్లవరం, విశాఖ సందేసం.....అల్లవరం మండలంలోని మొగళ్ళమూరులో వేంచేసియున్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు, అలాగే 14 న సోమవారం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు మొగళ్ళమూరు మాజీ సర్పంచ్ కాండ్రేగుల వెంకట సత్యనారాయణ( పెద్దబ్బాయి ) ధన కుమారి దంపతులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు దంపతులచే శ్రీ స్వామి వారి కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.14న సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు 26 వ తేదీ శనివారం వరకు వైభవంగా కొనసాగుతాయని, ముగింపు రోజున స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని మాజీ సర్పంచ్ కాండ్రేగుల వెంకట సత్యనారాయణ తెలిపారు.
భక్తులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆ విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ ప్రత్యేక పూజ వేడుకలలో మాజీ సొసైటీ అధ్యక్షులు. కాండ్రేగుల జవహర్లాల్, కాండ్రేగుల రాధాకృష్ణ, కాండ్రేగుల నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు తోటకూర సత్యనారాయణ రాజు, అల్లూరి చిట్టిబాబు రాజు, అల్లూరి గోపాలకృష్ణం రాజు, కైలా సోవన బాబు, కాండ్రేగుల కృష్ణ, అల్లూరి సత్యనారాయణ రాజు, డాక్టర్. ఆదినారాయణ,గ్రంధి వీరబాబు, మరియు శ్రీ గణపతి బాల భక్త సంఘం, శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం, ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

0 Comments