సింహాచలం...విశాఖపట్నం, సెప్టెంబర్ 14వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారంసింహాచలం మెట్ల మార్గంలో సింహాద్రినాథుడుని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి.. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెట్లు మార్గంలో ఉన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని ప్రత్యేకంగా నమస్కరించారు.
స్వామివారి ఆశీస్సులు తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, లోకమంతా సుభిక్షంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలని సింహాద్రినాథుడిని ప్రార్థించినట్లు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.
సింహాద్రినాథ నమో నారసింహ” అంటూ ఆయన భక్తిశ్రద్ధలతో స్వామివారిని స్మరించారు


0 Comments