సింహాచలం, సెప్టెంబర్ 14సింహాచలం ఆయిల్‌మిల్లు వద్ద శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నలభై ఏళ్లకు పైగా కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి అర్చక స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు, డాక్‌యార్డ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ నిరంతరంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి, ఈ నెల 26న గణపతి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు
వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అని పిలుపునిచ్చారు. ప్రకృతిని దైవస్వరూపంగా భావించడం మన సంస్కృతిలో అంతర్భాగమని, వినాయకుడి పూజలో ఉపయోగించే పత్రి, పుష్పాలు సైతం ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీకలని పేర్కొన్నారు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు.*పలు ప్రాంతాల్లో వినాయకుడు*
*విగ్రహాలు సందర్శన..ఆశీస్సులు*
సింహాచలం ఆయిల్ మిల్లు ప్రాంతంలో.. శ్రీ గణేష్ యువజన సేవా సంఘం.. ఏర్పాటుచేసిన వినాయకుడు..
సెడగంపేటలో శ్రీ శ్రీనివాస యూత్ అసోసియేషన్ ఏర్పాటు ఏర్పాటుచేసిన నరసింహ స్వామి అలంకరణలో ఉన్న వినాయక విగ్రహాన్ని . ఇంకా పాపయ్య రాజుపాలెం... అక్కయ్యపాలెం తో పాటు అనే ప్రాంతాల్లో విగ్నేశ్వరులను దర్శించుకునీ గంట్ల శ్రీనుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు



0 Comments