14.09.2026 విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు - కూటమి పాలనతో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలి - రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలందరికీ మంచి జరగాలి - వైఎస్ జగన్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలి - ఆయన చేపట్టే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా విజయవంతం కావాలి


విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.

అనంతరం శ్రీ కేకే రాజు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువు పరిస్థితులు పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, కూటమి పాలనతో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుని అనుగ్రహం ఉండాలని, ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఆకాంక్షించారు. అలాగే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మనసారా కోరుకున్నట్లు తెలిపారు.

భవిష్యత్తులో శ్రీ వైఎస్ జగన్ గారు చేపట్టే అన్ని కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా విజయవంతం కావాలని, పార్టీ మరింత బలోపేతం కావాలని శ్రీ కేకే రాజు గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ నాయకులు మంచ నాగమల్లేశ్వరి, పీవీ నారాయణ, తాడి జగన్నాథ్ రెడ్డి,  బోని శివరామకృష్ణ, బి ఫిన్ కుమార్ జైన్, గాలి ప్రసాద్, చొల్లంగి నాగేశ్వరరావు, మధు, జగదీష్, కొట్టాడా సూర్య, మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments