మెగా విక్టరీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు

 


గాజువాక  న్యూస్ :విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 68వ వార్డు మింది గ్రామంలో  మెగా విక్టరీ బాయ్స్ ఆధ్వర్యంలో  శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి  వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు లలితా దేవి అవతారంలో  9 అడుగుల ఎత్తులో భారీ గణనాథుడిని మండపంలో  ఏర్పాటు చేశారు  ప్రధాన అర్చకులు బుజ్జి పంతులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా  స్థానిక ప్రజలు 

మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో,ప్రశాంతవాతావరణంలోజరుపుకోవాలని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  మెగా విక్టరీ బాయ్స్  కమిటీ పెద్దలు కుర్రవాళ్ళు  మహిళలు భక్తులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Post a Comment

0 Comments