ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి

 


ఉక్కునగరం సమితిలో భక్తిశ్రద్ధలతో శ్రీ వినాయక చవితి వేడుకలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – ఉక్కునగరం సమితి ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 14, 2026న భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు శ్రీ వినాయక విగ్రహ ప్రతిష్ఠ, ప్రక్షాళన మరియు అభిషేక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బాలవికాస్ విద్యార్థులు మరియు యువత ఆధ్వర్యంలో శ్రీ గణేశ పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పూజా కార్యక్రమాన్ని శ్రీమతి జయ గౌరీ కామేశ్వరి గారు మరియు శ్రీ రత్నకుమార్ గారు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం సమితి ప్రధాన భజన గాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.ఈ సంవత్సరం ఉక్కునగరం సమితిలో శ్రీ వినాయక చవితి వేడుకలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 19న విశాఖపట్నంలోని ఆర్.కే. బీచ్‌లో, విశాఖపట్నం జిల్లా పరిధిలోని వివిధ సమితుల వినాయక విగ్రహాలతో కలిసి సామూహిక నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ ఆర్.ఏ. నాయుడు గారు, అలాగే అగనంపూడి మరియు కూర్మన్నపాలెం ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య

ఆశీస్సులతో, భక్తి, సేవ, ఐక్యత మరియు పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తితో ఈ వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమాలాన్నింటినీ

 శ్రీడీఏవీ సన్యాసి రాజు

కన్వీనర్, ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులు, ఇతర పదాధికారులతో కలిసి సమన్వయపరుస్తున్నారు.

Post a Comment

0 Comments