జారీ చేసిన వారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం - ఈరోజు అనగా తేది. 15.09.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డా.పి.జగదీశ్వర రావు వారి అధ్యక్షతన జిల్లాలో గల పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాదికారులకు బిల్ జంక్షన్ హల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు సీజనల్ వ్యాధుల మీద అనగా డెంగ్యూ, మలేరియా మొదలగు వాటి మీద త్రైమాసిక సమీక్ష చేశారు. మరియు ఎన్.వి.బి.డి.సి.పి ఆక్టివిటీస్ అన్నీ కూడా వైధ్యాదికారులందరికీ రీ-ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా మలేరియా అధికారి శ్రీ వరప్రసాద్ వారు, జివిఎంసి బయాలజిస్ట్ శ్రీ సాంబమూర్తి వారు మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి.నాగభూషణం వారు డెంగ్యూ, మలేరియా మొదలగు సీజనల్ వ్యాదుల గురించి వివరంగా విశదీకరించారు. డెంగ్యూ లక్షణములు, ముందు జాగ్రత్తలు గురించి తెలియచేశారు.         

జిల్లా ప్రోగ్రాం అధికారి డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం డా.బి.ఉమావతి, వారు మరియు డి.పి.ఒ శ్రీ శశిభూషణ్ వారు సంజీవని ప్రోగ్రాం గురించి ప్రోగ్రాం ఏ విధంగా నిర్వర్తించాలి, సంజీవని గ్యాప్ అనాలిసిస్ డి.పి.ఎం.ఒ మరియు డి.పి.ఒ విపులంగా విశదీకరించారు,   

తదుపరి డబ్ల్యు.హెచ్.ఒ. డా.కళ్యాణి వారు, డి.పి.హెచ్.ఎన్.ఒ శ్రీ ఎం.సత్యవతి వారు మాతా శిశు సంక్షేమం గురించి మరియు ఎం.ఎం.ఆర్. ఎనాలిసిస్ గురించి తెలియచేసారు. తదుపరి ఆర్.బి.ఎస్.కె. జిల్లా సమన్వయకర్త డా.బి.హారిక వారు, ఎన్.సి.డి, మరియు ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం గురించి విపులంగా తెలియచేసారు.

జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డా.లూసీ వారు వ్యాధినిరోధక టీకాల గురించి తెలియచేశారు.

తదుపరి జిల్లా లెప్రసీ మరియు క్షయ నివారణ అధికారి డా.ఆర్.రమేష్ వారు ఎల్.సి.డి.సి గురించి విపులంగా తెలియచేశారు. 

తదుపరి ఎపిడిమిక్స్, ఐ.హెచ్.ఐ.పి. మరియు సీజనల్ వ్యాధుల గురించి జిల్లా సర్వేలన్స్ అధికారి డా.ప్రదీప్ రాజా వారు మరియు జిల్లా ఎపిడిమాలజిస్ట్ డా.శాంతి సౌందర్య వారు వివరించారు.

తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు పైన తెలిపిన ప్రోగ్రాంలు అన్ని సమీక్షించడమే కాకుండా ఐ.వి.ఆర్.ఎస్. కాల్స్ గురించి ముఖ్యంగా శ్రద్ద పెట్టాలని, పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్రములలో సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని, ప్రజలకు వైద్యం అందేటట్లు చూడాలని తెలియచేశారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు, పట్టణ/ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

          జిల్లా వైద్య ఆరోగ్శాఖాధికారి 

                      విశాఖపట్నం

Post a Comment

0 Comments