వారణాసి- విశాఖ సందేశం వర్తవాహని- కాశీ పుణ్యక్షేత్రంలో, హనుమాన్ ఘాట్ వద్ద ఉన్న క్షత్రియ సేవా సంఘంలో, కాశి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులకు నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ, నారాయణ సేవను అందిస్తున్న శ్రీరామ రాజు గారిని వివేకానంద సంస్థ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివేకనంద సంస్థ అధ్యక్షులు సూరాడ. అప్పారావు మాట్లాడుతూ, కాశి లోనే కాదు, విశాఖపట్నం వివేకానంద సంస్థ ఆశ్రమంలో కూడా పలు సందర్భాలలో నిత్యా అన్నదానాలు నిర్వహిస్తున్న శ్రీరామ రాజు గారి అన్నదాన సేవలను కొనియాడారు .ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

0 Comments