SRINIVAS SPL Correspondent
రాజోలు, విశాఖ సందేసం...తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శివకోటి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద, శివకోడు లాకులు వద్ద ప్రధాన రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులపాటు జైలులో నిర్బంధించారని, ప్రజల కోసం అంతరం పరితపించే నాయకుడిని రాజకీయ కక్షతో ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా జరిగిందని అమూల్య పేర్కొన్నారు. మచ్చలేని మాజీ ముఖ్యమంత్రిపై కేసులు, అరెస్టులు పెట్టడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నేత అని తెలిపారు. అరెస్టు జరిగిన రోజును టీడీపీ శ్రేణులు ఇప్పటికీ మరచిపోలేదని, ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పడ్డ ఆవేదనను గుర్తు చేసుకున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టే చివరికి కోర్టు, ఈడి క్లీన్ చీట్ ఇచ్చాయి అని గుర్తు చేసారు. చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసులు, ఆయన అరెస్టు వ్యవహారంపై టీడీపీ శ్రేణులు తమ నిరసనను కొనసాగిస్తాయని అన్నారు. కొవ్వొత్తుల నిరసన సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలిపారు. నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ కార్యకర్తలు ఐక్యంగా నిలబడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ ముదునూరి చిన్నబాబు రాజు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు అనుసూరి సునీత రామ పురుషోత్తం, అడబాల సాయిబాబు, తాడి సత్యనారాయణ, బోళ్ల వెంకటరమణ, పితాని భాస్కర్, కసుకుర్తి త్రినాధ స్వామి, కోటిపల్లి రత్నమాల, ఆరుమల్లి భాను, పప్పుల రమేష్, గోనిపాటి రాజు, కడలి ఏడుకొండలు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



0 Comments