జారీ చేసిన వారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి


విశాఖపట్నం -తేది: 09.09.2026  సంగీత మధుర్ ఆర్ డి ఓ, భీమిలి, విశాఖపట్నం వారి అధ్యక్షతన సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబెర్ అప్ప్రొప్రియేట్ అథారిటీ మరియు అడ్వైజరీ కమిటీ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ 

సమావేశం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో భీమిలి RDO గారి ఛాంబర్ లో జరిగింది. ఈ సమావేశమునకు డాక్టర్ బి ఉమావతి  డిపిఎమ్ఓ మరియు నోడల్ ఆఫీసర్ వారు కమిటీ సభ్యులందరిని ఆహ్వానించి, ప్రసంగిస్తూ భీమిలిలో  ఉన్నటువంటి స్కానింగ్ కేంద్రములన్ని తనిఖీ చేసి తగు సూచనలు ఇవ్వడం జరిగిందని, 

ఈ తనిఖీలు ప్రతీ మూడు నెలలకొకసారి జరుగుతాయని తెలియచేసారు. RDO గారు ప్రసంగిస్తూ అన్ని స్కానింగ్ కేంద్రములు తగిన సమయంలో తనిఖీ చేయాలని మరియు డెకాయ్ ఆపరేషన్స్ క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలని ఆదేశించారు. అడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ 

చట్ట రీత్యా నేరం అనే నినాదంతో అవగాహన కలగ చేయాలని IEC కార్యక్రమాలు తరచూ అన్ని ప్రాంతాలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రము సందర్శన కి వెళ్ళినప్పుడు ఆ కేంద్రములో ఉన్న రిజిస్టర్ల ను క్షుణ్ణంగా పరిశీలించమని ఆదేశించారు. 

ఈ సమావేశం లో డాక్టర్ బి ఉమావతి డిపిఎంవో, డాక్టర్ మౌనిక గైనకాలజిస్ట్, KGH, డాక్టర్ చైతన్య రేడియాలజిస్ట్, డాక్టర్ అర్చన , పిడియాట్రిక్స్, శ్రీ బి.నాగేశ్వర రావు డెమో, శ్రీ శ్రీనివాస రావు, ASI భీమునిపట్నం  పోలీస్ స్టేషన్ వారు పాల్గొన్నారు. 

         జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                                    విశాఖపట్నం

Post a Comment

0 Comments