రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ సమక్షంలో బీజేపీ లో చేరిన కోరాడ అవినాష్*


విశాఖపట్నం -ఈరోజు 09-09-2026 బుధవారం ఉదయం బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఉమ్మిడి సుజాత రాజ్ నేతృత్వంలో

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారి సమక్షంలో కోరాడ అవినాష్ సుమారు 200 మందితో కలిసి జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ లో చేరిన కోరాడ అవినాష్ కు మరియు వారి అనుచరులకు రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కోరాడ అవినాష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం సాధిస్తున్న అపూర్వ అభివృద్ధి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ (BJP) పోషిస్తున్న కీలక పాత్రకు ఆకర్షితులై తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, స్థానిక సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, బీజేపీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి K రవిరాజ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments