SRINIVAS SPL Correspondent
కె.గంగవరం, విశాఖ సందేసం...డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ శేరిలంకలో ప్రధానోపాధ్యాయులు ఎ.సత్య పద్మిణి అధ్యక్షతన గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి కీర్తిశేషులు సాదే నాగూర్ మీరా సాహెబ్ ఎలిజిబెత్ దంపతుల జ్ఞాపకార్థం గ్రామంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన 2025,26 విద్యా సంవత్సరం గాను ప్రధమ బహుమతి పొద్దోక రేఖకు రూ. 5 వేలు ద్వితీయ బహుమతి కొండేపూడి గౌరీ రూ. 3 వేలు ,తృతీయ బహుమతి కొండేపూడి సతీష్ రూ.2 వేలు దుస్సాలువ,మెమొంటోతో వారి కుటుంబ సభ్యులు డి.ఆర్.కె విజయ్ కుమారి,రాజేంద్ర ప్రసాద్ జయశీల కుమార్ జవహర్లాల్ లు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పలువురు మీరా సాహెబ్ మాస్టారు యొక్క వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పలువురు ప్రశంసించారు.ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, శిష్యులు బుడితి వెంకటేశ్వర్లు,నేరేడుమిల్లి అబ్బులు,పోతుల నాగేశ్వర రావు,టి.రాజబాబు,పి.ఎం.సి.
చైర్మన్ గిడ్డి వెంకటేష్,ఎంపీటీసీ సభ్యులు కొండేపూడి గంగా భవాని తదితరులు పాల్గొన్నారు.


0 Comments