మోడీ క్రికెట్ లీగ్ ఫైనల్ లో రామ్ చరణ్ లెవెన్ ఘన విజయం... విజేతలకు ట్రోఫీ అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా....

           SRINIVAS SPL Correspondent 

అమలాపురం, విశాఖ సందేసం....అమలాపురం పట్టణంలోని బాలయోగి స్టేడియంలో నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మోడీ క్రికెట్ లీగ్ (MCL) ఫైనల్ మ్యాచ్ శనివారం ఉత్కంఠభరితంగా సాగింది. రామ్ చరణ్ లెవెన్, బీసీసీఏ డ్రాగన్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో రామ్ చరణ్ లెవెన్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించింది. అనంతరం నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కంచిపల్లి అబ్బులు, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లా చిట్టిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి, ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరాం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఫైనల్‌లో విజేతగా నిలిచిన రామ్ చరణ్ లెవెన్ జట్టుకు విజేత ట్రోఫీతో పాటు రూ.50 వేల నగదు బహుమతి చెక్కును అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన బీసీసీఏ డ్రాగన్స్ జట్టుకు రన్నరప్ ట్రోఫీతో పాటు రూ.25 వేల నగదు బహుమతి చెక్కును అందించారు. అలాగే టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్‌మెన్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతలకు ప్రత్యేక ట్రోఫీలను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మోడీ క్రికెట్ లీగ్ వంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో MCLను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులోనూ యువతను ప్రోత్సహించే మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై, ఇరు జట్ల ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. విజేతగా నిలిచిన రామ్ చరణ్ లెవెన్ ఆటగాళ్లను నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి డీవీఎస్ రాజు, బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొండేటి జయలక్ష్మి, సీనియర్ నాయకులు గోకరకొండ గంగన్న స్వామి, యనమదల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments