విశాఖపట్నంలో వాయు కాలుష్యాన్ని నివారించండి


విశాఖపట్నంవాయు- 8-9-2026నాణ్యత మెరుగుదలకు సమన్వయ చర్యలు చేపట్టాలి- ఏపీపీసీబీ చైర్మన్ డా. పి. కృష్ణయ్య,స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా విశాఖపట్నం నగరంలో “క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్” అంశంపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), జీవీఎంసీ సమన్వయంతో సంప్రదింపుల సదస్సు నిర్వహించింది. ఏపీపీసీబీ చైర్మన్ డా. పి. కృష్ణయ్య, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ ముత్తంశెట్టి అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్, జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్, ఐఏఎస్ పాల్గొన్నారు.


ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, ప్రజలు తదితర భాగస్వాములు పాల్గొని నగరంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు, నియంత్రణ చర్యలపై చర్చించారు. SO₂, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పార్టిక్యులేట్ మేటర్ సైజు 2.5 మరియు 10 వంటి కాలుష్య కారకాల ఉద్గారాలను నియంత్రించడంతో పాటు సహజ వనరులు, పచ్చదనాన్ని పరిరక్షించాలని సూచించారు.

పర్యావరణవేత్త, విద్యావేత్త డా. కె. మాణిక్య కుమారి విశాఖ నగరంలోని కొండలు, సహజ వృక్ష సంపదను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను వివరించారు. అభివృద్ధి పేరుతో కొండలపై వృక్ష సంపద తొలగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తొలగించిన వృక్ష సంపదకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ బెల్టులు, గ్రీన్ బఫర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అడవులు, పట్టణ పచ్చదనం కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించే సహజ కార్బన్ సింక్‌లుగా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు.

కన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్, పోర్టు కార్యకలాపాలు, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా వాయు కాలుష్యం అధికంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో దుమ్ము కాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టులో లోడింగ్, అన్‌లోడింగ్, కన్వేయర్ బెల్ట్ కార్యకలాపాలను క్లోజ్డ్ సిస్టమ్‌లో నిర్వహించాలని సూచించారు.

భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, డేటా సెంటర్ల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలపై కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేసి, సమగ్ర పర్యావరణ అంచనా మరియు కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. భాగస్వాముల సూచనలను అధికారులు నమోదు చేసుకుని, విశాఖ నగర వాయు నాణ్యత మెరుగుదలకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments