సింహాచలం, సెప్టెంబర్ 9, 2026:శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలంలో సామవేద పారాయణదారు గ్రేడ్–III పోస్టుకు శ్రీ బొగ్గవరపు లలిత్ కుమార్ శర్మ ఎంపికయ్యారు.
మౌఖిక పరీక్షలో అభ్యర్థి ప్రతిభ, సామవేద పరిజ్ఞానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని శ్రీ బొగ్గవరపు లలిత్ కుమార్ శర్మ, తండ్రి శ్రీ బి. శివనాథ్‌ను సింహాచలం దేవస్థానంలోని సామవేద పారాయణదారు గ్రేడ్–III పోస్టుకు ఎంపిక చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నేడు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు చేతుల మీదుగా లలిత్ కుమార్ శర్మకు నియామక ఉత్తర్వులు అందజేశారు.
ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, దేవస్థానంలో వేదపారాయణాలు, ఆగమ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడంలో వేద పండితుల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.
నూతనంగా నియమితులైన సామవేద పారాయణదారు దేవస్థానంలో విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని ఈఓ ఆకాంక్షించారు.

0 Comments